దేశంలో 92 రోజుల్లోనే 12 కోట్ల టీకాల పంపిణీ!
close

తాజా వార్తలు

Published : 18/04/2021 14:35 IST

దేశంలో 92 రోజుల్లోనే 12 కోట్ల టీకాల పంపిణీ!

దిల్లీ: కరోనా వైరస్‌ టీకా పంపిణీలో భారత్‌ మరో మైలు రాయిని చేరుకుంది. కేవలం 92 రోజుల్లో అత్యంత వేగంగా 12 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీని పూర్తి చేసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. యూఎస్‌లో ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి 97 రోజులు పట్టగా.. చైనాలో 108 రోజులు సమయం పట్టినట్లు తెలిపింది. 
 
‘ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా భారత్‌ 90 రోజుల్లో 12 కోట్ల డోసులు పూర్తి చేసుకుంది. తాజా గణాంకాల ప్రకారం నేటికి దేశంలో మొత్తం 12.26కోట్లకు పైగా టీకాలు ఇచ్చాం. అందులో ఆరోగ్య సిబ్బందిలో 91లక్షల మందికి పైగా తొలి డోసు టీకా తీసుకోగా, 57లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌లో 1.12కోట్లకు పైగా తొలి డోసు తీసుకోగా.. 55లక్షలకు పైగా రెండో డోసు తీసుకున్నారు’ అని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

‘8 రాష్ట్రాల్లో టీకా ప్రక్రియ 59.5శాతంగా నమోదైంది. అందులో గుజరాత్‌లో 1.03కోట్లు, మహారాష్ట్రలో 1.21 కోట్లకు పైగా, యూపీలో 1.07 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. 12 కోట్ల మైలు రాయి చేరుకోవడానికి యూఎస్‌లో 97, చైనాలో 108 రోజులు సమయం పట్టింది’ అని కేంద్రం పేర్కొంది. కాగా, గడిచిన 24 గంటల్లో 26 లక్షల డోసులు పంపిణీ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని