Covid vaccine: కొవిడ్‌ వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌.. గడువులోగా అందుకోనివారు కోట్లలోనే!

తాజా వార్తలు

Updated : 19/08/2021 22:20 IST

Covid vaccine: కొవిడ్‌ వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌.. గడువులోగా అందుకోనివారు కోట్లలోనే!

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. గతంతో పోలిస్తే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఈ మధ్య కాస్త వేగం పుంజకుంది. కానీ, కొన్నాళ్ల క్రితం వ్యాక్సిన్‌ దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రుల వద్ద క్యూ కట్టారు. కొందరైతే వ్యాక్సిన్‌ డోసు డోసుకు మధ్య నిర్దేశించిన గడువులోగా వేసుకోలేకపోయారు. మనలోనూ చాలా మందికి ఈ పరిస్థితి ఎదురై ఉంటుంది. ఇలా దేశవ్యాప్తంగా ఎంతమంది గడువులోగా వ్యాక్సిన్‌ వేసుకోలేకపోయారన్న దానిపై లెక్కలు తీస్తే భారీ సంఖ్యే వెలుగుచూసింది. ఈ మేరకు దాఖలైన ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్రం సమాధానం ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 3.86 కోట్లమంది పైమాటేనని పేర్కొంది.

కొవిన్‌ పోర్టల్‌ ప్రకారం గురువారం నాటికి దేశవ్యాప్తంగా 44,22,85,854 మంది తొలి డోసు తీసుకున్నారు. 12,59,07,443 మంది సెకండ్‌ డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అయితే, వ్యాక్సినేషన్‌కు సంబంధించి గడువులోగా రెండో డోసు వేసుకోలేకపోయిన వారి వివరాలను రమణ్‌ శర్మ వ్యక్తి స.హ. చట్టం కింద కోరగా.. ఆగస్టు 17 నాటికి ఉన్న వివరాలను కేంద్రం సమాధానంగా వెల్లడించింది. కొవిషీల్డ్‌ తొలి డోసు వేసుకున్న 3,40,72,993 మంది, కొవాగ్జిన్‌ తొలి డోసు వేసుకున్న 46,78,406 మంది గడువులోగా టీకా వేసుకోలేకపోయారని కేంద్రం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం కొవిషీల్డ్‌కు రెండు డోసుల మధ్య గడువు 84-112 రోజులు ఉండగా.. కొవాగ్జిన్‌కు ఆ గడువును 28-42 రోజులుగా కేంద్రం నిర్దేశించిన సంగతి తెలిసిందే. డోసులను సకాలంలో వేసుకోవాలని మాత్రమే ఆరోగ్యశాఖ సూచించిందే తప్ప.. గడువు తీరిన అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని