పాక్‌ జైళ్లలో ఉన్న భారతీయులు ఎందరంటే?

తాజా వార్తలు

Updated : 02/01/2021 13:31 IST

పాక్‌ జైళ్లలో ఉన్న భారతీయులు ఎందరంటే?

ఇస్లామాబాద్‌: భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా పాకిస్థాన్‌ కారాగారాల్లో ఉన్న 49 మంది పౌరులు, 270 మంది మత్స్యకారుల జాబితాను ఆ దేశం శుక్రవారం భారత్‌కు అందించింది. ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్‌కు పాక్‌ 319 మంది భారతీయ ఖైదీల జాబితాను పంపింది. 2008 మే 21 జరిగిన కాన్సులర్‌ యాక్సిస్‌ ఒప్పందం ప్రకారం ఏటా జనవరి 1, జులై 1వ తేదీల్లో ఖైదీల వివరాలు అందిస్తారు. మరోవైపు భారత్‌ కూడా దిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌కు 340 మందితో కూడిన జాబితాను అందించింది. ఇందులో 263 మంది పౌరులు, 77 మంది మత్స్యకారులు ఉన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా ఈ సమాచార మార్పిడిని కొనసాగిస్తున్నారు.

అణ్వాయుధాల వివరాలూ..

గత 30 ఏళ్లుగా భారత్‌ పాక్‌ మధ్యనున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఇరుదేశాల్లోని అణ్వాయుధాల వివరాలను శుక్రవారం పరస్పరం సమర్పించాయి. ఇరు దేశాల మధ్యనున్న వైరం కారణంగా ఎటువంటి ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంతో ఈ ఒప్పందాన్ని అమలులోకి తెచ్చారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 1988, డిసెంబరు 31న ఈ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేయగా 1991, జనవరి 27 నుంచి అమలులోకి వచ్చింది. మొదటిసారిగా ఈ వివరాలను 1992 జనవరి 1 నుంచి పరస్పరం మార్చుకోవడం ప్రారంభించాయి.

ఇదీ చదవండి..

కొవిషీల్డ్‌ టీకాకు గ్రీన్‌సిగ్నల్‌!



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని