DGP: దాడి చేసిన డ్రోన్‌ నేరుగా పాక్‌ నుంచే.. 

తాజా వార్తలు

Published : 21/07/2021 01:08 IST

DGP: దాడి చేసిన డ్రోన్‌ నేరుగా పాక్‌ నుంచే.. 

శ్రీనగర్‌: జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్ దాడిచేసిన ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ ప్రభుత్వం సహకారం అందించినట్లు జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ వెల్లడించారు. దాడి చేసిన డ్రోన్ నేరుగా పాకిస్థాన్ నుంచే వచ్చినట్లు పేర్కొన్నారు. డ్రోన్ దాడిలో ఉపయోగించిన ఐఈడీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు అయిందేనన్నారు. ఐఈడీలో ఉపయోగించిన ఆర్డీఎక్స్‌ బహిరంగ మార్కెట్‌లో లభించిందన్న డీజీపీ.. అది సైనిక దళాలు వినియోగించే పేలుడు పదార్థమని, సరిహద్దు అవతల నుంచి పాక్‌ ప్రభుత్వమే ఆ పేలుడు పదార్థాన్ని సమకూర్చి ఉంటుందని తెలిపారు. 

జమ్ము వైమానిక స్థావరంపై దాడి జరిగిన రోజే ఆరు నుంచి ఏడు కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. జమ్ములోని మరో ప్రాంతంలో డ్రోన్‌ ద్వారా పేలుడు పదార్థాలను అందుకొన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు తెలిపారు. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ దాని సభ్యులకు ఆయుధాలు, డ్రగ్స్‌, డబ్బు అందజేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. జమ్ము వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడిలో లష్కరే తొయిబాతో పాటు పాక్‌ ప్రభుత్వానికి తప్పక ప్రమేయం ఉంటుందని దిల్‌బాగ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

ఇటీవల జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోకి ప్రవేశించిన రెండు డ్రోన్లు బాంబులు జారవిడిచాయి. ఈ ఘటనలో భవనం పైకప్పు ధ్వంసమైంది. ఈ తర్వాత మరుసటి రోజే జమ్ములోని సైనిక స్థావరంపై డ్రోన్ దాడిని సైన్యం భగ్నం చేసింది. రెండు రోజుల తర్వాత కాలూచక్, రత్నచక్, అర్నియా ప్రాంతంలో డ్రోన్లు కనిపించాయి. ఆ తర్వాత కూడా పలు ప్రాంతాల్లో డ్రోన్లు కనిపిస్తున్నాయని సైనిక బలగాలు పేర్కొంటున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని