Pegasus: జాబితాలో ఇమ్రాన్‌ఖాన్‌ నంబర్‌..!

తాజా వార్తలు

Updated : 20/07/2021 15:00 IST

Pegasus: జాబితాలో ఇమ్రాన్‌ఖాన్‌ నంబర్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నంబర్‌ను హ్యాక్‌ చేసినట్లు ‘డాన్‌’ పత్రిక పేర్కొంది. పెగాసస్‌ నిఘా నేత్రం కింద పాక్‌లోని వందల మంది ఫోన్‌ నంబర్లు ఉన్నట్లు తెలిపింది. గతంలో ఇమ్రాన్‌ఖాన్‌ వినియోగించిన ఒక ఫోన్‌ నంబర్‌ కూడా ఇందులో ఉన్నట్లు వెల్లడించింది.

దీనిపై పాక్‌ సమాచార ప్రసార శాఖ మంత్రి ఫవాద్‌ స్పందించారు. ఇది చాలా ఆందోళనకర అంశమని తెలిపారు. మోదీ ప్రభుత్వ అనైతిక విధానాలు ఈ ప్రాంతంలో ప్రమాదకరంగా పరిణమించాయన్నారు. పాక్‌ మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్‌ మాజారీ స్పందిస్తూ భారత్‌ సొంత మంత్రులపైనే ఎలా నిఘా పెట్టిందో పెగాసస్‌ నివేదిక రెండో భాగం వెల్లడించిందన్నారు.

పెగాసస్‌ హ్యాకింగ్‌కు గురైన వారి  జాబితాలో ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’కు చెందిన దివంగత జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ ప్రియురాలు హాటిస్‌ సెంగిజ్‌ కూడా ఉన్నారు. 2018లో ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా కాన్సులేట్‌లో ఖషోగ్గీ హత్యకు గురయ్యాక కేవలం నాలుగు రోజులకే ఆమె ఫోన్‌లోకి స్పైవేర్‌ను చొప్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని