కుల్‌భూషణ్‌ జాదవ్‌:కీలక బిల్లుకు పాక్‌ ఆమోదం
close

తాజా వార్తలు

Published : 11/06/2021 23:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుల్‌భూషణ్‌ జాదవ్‌:కీలక బిల్లుకు పాక్‌ ఆమోదం

ఇస్లామాబాద్‌: పాక్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ విషయంలో మరో ముందడుగు పడింది. తనకు విధించిన మరణశిక్షను అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించే కీలక బిల్లుకు పాకిస్థాన్ పార్లమెంట్‌లోని దిగువ సభ అయిన జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ న్యాయస్ధానం (సమీక్ష, పునఃసమీక్ష )- 2020 పేరుతో రూపొందిన ఈ బిల్లుకు అక్కడి ప్రభుత్వం మద్దతు ఉంది. ఈ బిల్లుతో పాటు మరో 20 బిల్లులు విపక్షాల ఆందోళనల నడుమ ఆమోదం పొందాయి. మరణశిక్ష విషయంలో భారత ప్రభుత్వంతో దౌత్యపరమైన సంప్రదింపులు జరిపేందుకు కుల్‌భూషణ్‌కు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. 

గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై కుల్‌భూషణ్‌కు 2017లో పాక్‌ మరణశిక్ష విధించింది. దీనిపై భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. శిక్షపై అప్పీల్‌ చేసుకునేందుకు, భారత్‌తో కుల్‌భూషణ్‌ దౌత్యపరమైన సంప్రదింపులు జరిపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో గతంలో పాక్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. తాజాగా దిగువ సభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సెనేట్‌కు పంపనున్నారు. అక్కడా ఆమోదం పొందితే దేశాధ్యక్షుడి ఆమోదం కోసం ఈ బిల్లు వెళ్లనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని