close

తాజా వార్తలు

Published : 21/04/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Walk test.. ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండి!

పాల్గఢ్‌లో అధికారుల ప్రచారం

ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ ఉరుముతోంది. రోజురోజుకీ రోగుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరతతో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే చికిత్సపొందుతున్న కొవిడ్‌ రోగులు 6 నిమిషాల పాటు నడకతో తమ ఆక్సిజన్‌ స్థాయిలు తెలుసుకొనేలా మహారాష్ట్రలోని పాల్గఢ్‌లోని వైద్యశాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి ఫోన్‌ చేసి దీని గురించి వివరించడం విశేషం. క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగులకు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడగా.. హోం ఐసోలేషన్‌లో ఉంటున్నవారు సైతం ఆక్సిజన్‌ సిలిండర్లు కొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రయత్నాలు సాగిస్తున్న వేళ అధికారులు చెబుతోన్న ఈ ‘నడక పరీక్ష’ ప్రస్తుతం అక్కడ ప్రాధాన్యం సంతరించుకుంది. 

నడక పరీక్ష ఎలాగంటే..?

కొవిడ్‌ రోగులు నడక ప్రారంభించే ముందు తమ చేతి వేలికి పల్స్‌ ఆక్సీమీటర్‌ పెట్టుకోవాలి. ఆ సమయంలో తమ రక్తంలో ఉన్న ఆక్సిజన్‌ స్థాయిలు ఎలా ఉన్నాయో రాసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో/ కారిడార్లలో మద్యస్థంగా ఆరు నిమిషాల పాటు నడక కొనసాగించాలి (మెట్లు ఎక్కొద్దు). నడక పూర్తయిన తర్వాత పల్స్‌ ఆక్సీ మీటర్‌లో తాజా రీడింగ్‌ ఎంత ఉందో సరిచూసుకోవాలి. పల్స్‌ ఆక్సీమీటర్‌లో గనక ఒకవేళ రీడింగ్‌ 94కన్నా తక్కువ ఉంటే వైద్యసాయం పొందాల్సిన అవసరం ఉంటుందని గుర్తించవచ్చు. 

ఇటీవల కొవిడ్ పరిస్థితిపై జరిగిన సమీక్షలో ఈ ఆరు నిమిషాల నడక పరీక్షను రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ ప్రదీప్‌ వ్యాస్‌ సూచించారు. దీంతో హోంఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ రోగులకు ఆదివారం నుంచి ఈ పరీక్ష గురించి ఫోన్‌ కాల్స్‌ వస్తుండటంతో వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ పరీక్ష రోజులో రెండు మూడుసార్లు చేసుకోవడం ద్వారా రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయిలను తెలుసుకొనేందుకు దోహదపడుతుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని