పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కుదింపు!

తాజా వార్తలు

Updated : 24/03/2021 13:38 IST

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కుదింపు!

దిల్లీ: నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను కుదించే అవకాశాలున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నెల రోజుల పాటు జరగాల్సి ఉండగా.. ఎన్నికల దృష్ట్యా రెండు వారాల ముందే ముగించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

మార్చి 8 నుంచి మొదలైన ఈ రెండో విడత సమావేశాలు ఏప్రిల్‌ 8 వరకు జరగాలి. అయితే మార్చి 25నే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వీలుగా సమావేశాల గడువును తగ్గించాలని పలు రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు గతంలో లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌, పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రికి లేఖ రాశారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం సమావేశాలను కుదించనున్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్‌ తొలి విడత సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ ప్రవేళపెట్టారు. అనంతరం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం, బడ్జెట్‌పై సాధారణ చర్చ జరిగింది. వీటితో పాటు వ్యవసాయ చట్టాలపైనా చర్చ జరిగిన తర్వాత పార్లమెంట్‌ మార్చి 8వరకు వాయిదా పడింది.

పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఏప్రిల్‌ 6న ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించనుండగా.. పశ్చిమ బెంగాల్‌, అసోంలో మార్చి 27 నుంచి పలు విడతల్లో ఎన్నికలు జరనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడుతాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని