గర్భవిచ్ఛిత్తి సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

తాజా వార్తలు

Updated : 17/03/2021 11:46 IST

గర్భవిచ్ఛిత్తి సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

దిల్లీ: కాల పరిమితి పెంచుతూ చేసిన గర్భవిచ్ఛిత్తి సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. గరిష్ఠంగా 24 వారాల వరకు గర్భవిచ్ఛిత్తికి అవకాశమిస్తూ కేంద్రం ఈ చట్టంలో సవరణ చేసింది. దీంతో ప్రత్యేక కేసుల్లో 24 వారాల వరకూ గర్భవిచ్ఛిత్తికి వీలు ఉంటుంది. గతేడాదే కేంద్ర కేబినెట్‌ ఈ బిల్లుకు సవరణ చేసి ఆమోద ముద్ర వేసింది. అనంతరం లోక్‌సభలోనూ ఈ బిల్లు ఆమోదం పొందింది. తాజాగా రాజ్యసభలో ఆమోదం లభించింది. గతంలో గర్భవిచ్ఛిత్తి కాల పరిమితి 20వారాలే ఉండేది. అయితే అత్యాచారం, మైనర్లు, దివ్యాంగులపై లైంగిక దాడి ఘటనల్లో బాధితులకు ఊరట కల్పించడం కోసం ఈ బిల్లులో సవరణ చేశారు. రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టగా.. సెలక్ట్‌ కమిటీకి పంపాలని కొందరు సభ్యులు డిమాండ్‌ చేశారు. కానీ, మూజువాణి ఓటు ద్వారా గర్భవిచ్ఛిత్తి సవరణ బిల్లు ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ ప్రకటించారు.

గర్భవిచ్ఛిత్తి సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. బిల్లు సవరణపై అంతర్జాతీయంగా అధ్యయనం చేశామని, దేశంలోనూ క్షేత్రస్థాయిలో చర్చలు జరిపామని వెల్లడించారు. మహిళలకు హాని కలిగించే ఎలాంటి చట్టాలను ఈ ప్రభుత్వం రూపొందించబోదని స్పష్టం చేశారు. ఈ బిల్లు మహిళల ఆత్మగౌరవాన్ని రక్షించేదేనని కేంద్ర మంత్రి తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని