విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..
close

తాజా వార్తలు

Published : 06/03/2021 02:18 IST

విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..

దిల్లీ: మరికొద్ది నిమిషాల్లో ఆ విమానం గాల్లోకి ఎగరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణీకులందరూ విమానంలోకి వచ్చేశారు. ఇక అనుమతి వస్తే గమ్యస్థానానికి బయలుదేరడమే ఆలస్యం. సరిగ్గా అదే సమయంలో ఓ ప్రయాణికుడు చేసిన ప్రకటనతో అందరూ ఉలిక్కి పడ్డారు. పైలట్‌ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. 6ఈ-286 నెంబర్‌ ఇండిగో విమానం దిల్లీ విమానాశ్రయం నుంచి కొద్ది సమయంలో పుణెకు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, రుజువు కోసం పత్రాలు చూడండంటూ ప్రకటించడంతో విమానంలోని వారందరూ కంగుతిన్నారు. దీంతో అప్రమత్తమైన పైలట్ గ్రౌండ్ కంట్రోలర్స్‌తో రేడియోలో మాట్లాడి అక్కడి పరిస్థితిని వివరించాడు. అనంతరం ఆ వ్యక్తి కూర్చున్న సమీపంలోని 6 నుంచి 8 నెంబర్‌ సీట్ల ప్రయాణీకులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని విమానాశ్రయ అధికారులు సూచించారు. కాగా, ఆ సీట్లను శానిటైజ్‌ చేసి, కొత్త సీటు కవర్‌లు అమర్చారు. దీంతో విమానం కాస్త ఆలస్యంగా బయలుదేరింది. తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఆ వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం సౌత్‌ దిల్లీలోని  ఓ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని