ట్రంప్‌ను తొలగించబోను: పెన్స్‌

తాజా వార్తలు

Updated : 13/01/2021 13:39 IST

ట్రంప్‌ను తొలగించబోను: పెన్స్‌

అధికార బదిలీపై దృష్టి సారించాలని ప్రతినిధుల సభకు హితవు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను 25వ సవరణ అధికారం ద్వారా పదవి నుంచి తొలగించేది లేదని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీకి లేఖ రాశారు. క్యాపిటల్‌ భవనంపై దాడి నుంచి యావత్తు దేశం కోలుకోవడానికి ఇదే సరైన సమయన్నారు.

అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ద్వారా కేబినెట్‌ ఆమోదంతో అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేసే అధికారం ఉపాధ్యక్షుడికి ఉంటుంది. అధ్యక్షుడు అసమర్థుడని భావించినప్పుడు ఈ అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ, పెన్స్‌ అందుకు విముఖత వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి కేవలం కొన్ని రోజుల గడువే ఉండడంతో అధికార బదిలీపై దృష్టి సారించాలని ఆయన పెలోసీకి సూచించారు. ఈ సమయంలో అధ్యక్షుడిపై ప్రజల్లో మరింత విభజన, అసహనానికి కారణమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ట్రంప్‌ను తొలగించాలనుకోవడం కేవలం రాజకీయం చేయడమేనని విమర్శించారు. అయితే డెమొక్రాట్లు మాత్రం ట్రంప్‌ అభిశంసనకు సిద్ధమవుతున్నారు. ఈరోజు ప్రతినిధుల సభలో దీనిపై చర్చ జరగనుంది.

మరోవైపు ట్రంప్‌-పెన్స్‌ మధ్య కోపతాపాలు చల్లారినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించే సమయంలో పెన్స్‌ అధ్యక్షుడి ఆదేశాలను బేఖాతరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరువురి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఓ దశలో పెన్స్‌పై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మంగళవారం వారివురు శ్వేతసౌధంలోని ఓవల్‌ ఆఫీస్‌లో కలుసుకున్నారు. పదవీకాలం పూర్తయ్యే వరకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

ఇవీ చదవండి..

వాషింగ్టన్‌లో ఆత్యయిక పరిస్థితి

చర్చలతో స్నేహపూర్వక పరిష్కారంAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని