Vaccine: టీకా వద్దంటూ నదిలో దూకిన ప్రజలు

తాజా వార్తలు

Published : 24/05/2021 18:32 IST

Vaccine: టీకా వద్దంటూ నదిలో దూకిన ప్రజలు

 

లఖ్‌నవూ: ఓవైపు క‌రోనా టీకాల కొరత వేధిస్తుంటే మరోవైపు వ్యాక్సిన్లపై ఇంకా పలు ప్రాంతాల్లో వదంతులు వస్తూనే ఉన్నాయి. టీకా ఇస్తామంటే ఆనందంగా తీసుకోవాల్సిన ఈ సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామ ప్రజలు మాత్రం మాకొద్దు బాబోయ్‌ అంటూ ఏకంగా నదిలోకి దూకేశారు. వివరాల్లోకి వెళితే.. 

ఉత్తర్‌ప్ర‌దేశ్‌లో బారాబంకీ జిల్లాలోని ఓ గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య శాఖ అధికారులు శనివారం క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి వెళ్లారు. టీకా కోసం రావాల్సిందిగా ప్ర‌జ‌ల‌కు అధికారులు విజ్ఞ‌ప్తి చేశారు. కానీ ప్ర‌జ‌లు మాత్రం టీకా వేయించుకోకుండా అక్క‌డి నుంచి పారిపోయి సమీపంలో ఉన్న స‌ర‌యూ న‌దిలో దూకారు. అది క‌రోనా టీకా కాదు.. విష‌పూరిత‌మైన ఇంజెక్ష‌న్ అని ప్ర‌చారం చేయ‌డం వల్లే ప్రజలు తీవ్ర భ‌యాందోళ‌న‌లకు గురైన‌ట్లు అధికారుల విచార‌ణ‌లో తేలింది. చివరకు అధికారులు వ్యాక్సినేషన్‌పై పూర్తిస్థాయి అవగాహన కల్పించగా.. కేవలం 14 మంది మాత్రం టీకా తీసుకోవడానికి ముందుకొచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని