ఫైజర్‌ తొలి డోసు 85శాతం సమర్థవంతం

తాజా వార్తలు

Published : 19/02/2021 14:45 IST

ఫైజర్‌ తొలి డోసు 85శాతం సమర్థవంతం

వెల్లడించిన పరిశోధకులు

జెరూసలేం: ఫైజర్ టీకా తొలి డోసు 85శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని చేసినట్లు ఇజ్రాయెల్‌లోని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశంలోని షెబా మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు వెల్లడించారు. ఇటీవల ఈ పరిశోధనా పత్రాలు లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఫైజర్‌ టీకా రెండు డోసులను 21 రోజుల వ్యవధితో తీసుకోవాలని తయారీదారులు సూచించారు. టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కరోనాను ఎదర్కొనేందుకు 95శాతం సామర్థ్యం లభిస్తుందని వారు తెలిపారు. టీకా సరఫరాలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒక్క డోసు సరిపోతుందని పరిశోధకులు వెల్లడించారు.

ఫైజర్‌ మొదటి డోసు చాలా ఎక్కువ ప్రభావం చూపుతుండటంతో రెండు డోసులకు మధ్య విరామాన్ని పెంచాలని గతంలో కెనెడాకు చెందిన పరిశోధకులు కూడా సూచించారు. వారి పరిశోధన ప్రకారం తొలి డోసు తీసుకున్న చాలా మందిలో రోగనిరోధకశక్తి పెరిగినట్లు గుర్తించామన్నారు. దీనికి సంబంధించి ఆరోగ్య అధికారులు చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.

షెబా పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం 7,214 మంది ఆరోగ్య సిబ్బందిని ఈ పరిశోధనలో పరీక్షించామన్నారు. వీరిలో అందరూ ఆరోగ్యంగా ఉన్న యువతీయువకులేనని వారు స్పష్టం చేశారు. కాగా, ఈ పరిశోధన ఫలితాలపై స్పందించేందుకు ఫైజర్‌ నిరాకరించింది. ఇజ్రాయెల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తాము వ్యాక్సిన్‌పై ఫలితాలను విశ్లేషిస్తున్నామని ఫైజర్‌ ఒక ప్రకటనలో తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని