Pfizer Vaccine: మరో సానుకూల కబురు

తాజా వార్తలు

Updated : 18/05/2021 15:07 IST

Pfizer Vaccine: మరో సానుకూల కబురు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనావైరస్‌ను అత్యంత సమర్థంగా అడ్డుకుంటున్న ఫైజర్‌ టీకాల విషయంలో మరో సానుకూల కబురును ఐరోపా మెడిసిన్‌ ఏజెన్సీ తెలిపింది. ఒక సారి అత్యంత శీతల వాతవారణం నుంచి బయటకు  తీసుకు వచ్చిన టీకాల వయల్స్‌ను వినియోగించకపోతే నెలరోజుల వరకు  ఫ్రిజ్‌లో నిల్వ ఉంచవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ పరిమితి ఐదురోజుల వరకే ఉంది. ఈ నిర్ణయంతో ఐరోపా సంఘంలోని చాలా దేశాల్లో దీనికి అనుమతులు లభించే అవకాశం ఉంది. 

ఇప్పటి వరకు ఫైజర్‌ టీకాలను రవాణ చేయడానికి అత్యంత శీతల ఉష్ణోగ్రత అవసరం కావడం పెద్ద ఇబ్బందిగా మారింది. దీంతో ప్రపంచంలోనే ఆ స్థాయిలో శీతలీకరణ వ్యవస్థ లేని భారత్‌ వంటి దేశాలు దీనిపై ఆసక్తి చూపలేదు. ఫిబ్రవరిలో అమెరికా దీనిని నిల్వ చేసేందుకు అవసరమైన -80 నుంచి -60 ఉష్ణోగ్రతను -15 నుంచి -25 డిగ్రీలకు పెంచింది. ఫైజర్‌ అభివృద్ధి చేసిన 12-15 సంవత్సరాల పిల్లల టీకాకు కెనడాలో అనుమతులు లభించాయి. దీంతో ఈ వయస్సు వారికి టీకాలు వేస్తున్న తొలిదేశంగా కెనడా నిలిచింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని