
తాజా వార్తలు
అమ్మకానికి 60 లక్షల మంది భారతీయుల నెంబర్లు
ఇంటర్నెట్‌డెస్క్: ఫేస్బుక్ వినియోగించే 60 లక్షల మంది భారతీయుల ఫోన్‌నెంబర్లు టెలిగ్రామ్ యాప్‌లో విక్రయానికి పెట్టారని అండర్‌ది బ్రీచ్ పేరుతో ట్విటర్ ఖాతా నిర్వహించే సైబర్ నిపుణుడు అలొన్ గాల్ వెల్లడించారు. ఈ ఫోన్ నెంబర్లను విక్రయించే వ్యక్తి వద్ద మొత్తం 533 మిలియన్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారం కూడా ఉందని చెప్పుకొంటున్నట్లు అలొన్ తెలిపారు. ఫేస్‌బుక్‌లోని ఒక లోపాన్ని అతడు ఆసరాగా చేసుకొని వీటిని సంపాదించినట్లు వెల్లడించాడు. ఇవి 2019 ముందే సేకరించినట్లు తెలుస్తోంది. అతడు చెబుతున్న లోపాన్ని 2019లో ఫేస్బుక్ సరిచేసింది.
అప్పటికే ఫేస్‌బుక్‌కు ఫోన్‌నెంబర్ లింక్ చేసిన 500 మిలియన్లకు పైగా ఖాతాల నుంచి సమాచారం తీసుకొన్నారు. వీటిని టెలిగ్రామ్‌లో ఓ బాట్ ద్వారా అమ్మకానికి పెట్టారు. వీటిల్లో 60లక్షల మంది భారతీయుల సమాచారం కూడా ఉంది. ఈ విషయాన్ని తొలిసారి గాల్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. సదరు హ్యాకర్ సోషల్ మీడియా ఖాతాలు.. వాటి ఫోన్ నెంబర్లతో ఓ డేటాబేస్ తయారు చేసి వాటిని విక్రయిస్తున్నాడని అలొన్ వెల్లడించారు. ఈ డేటాబేస్‌తో వ్యక్తి ఫేస్బుక్ ఖాతా సాయంతో అతని ఫోన్‌నెంబర్ కనిపెట్టవచ్చు. దీంతో ఒక్కో ఖాతా ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి 5 డాలర్లు.. అదే పెద్దమొత్తంలో డేటా తెలుసుకోవాలంటే 5వేల డాలర్లు ధరను ఆ హ్యాకర్ నిర్ణయించాడు. జనవరి 12వ తేదీ నుంచి వీటిని విక్రయానికి ఉంచినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
దిల్లీలో టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత!