సెంట్రల్‌ విస్టా పనులు సమర్థించుకున్న కేంద్రం
close

తాజా వార్తలు

Published : 12/05/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెంట్రల్‌ విస్టా పనులు సమర్థించుకున్న కేంద్రం

దిల్లీ: కొవిడ్‌ వేళ సెంట్రల్‌ విస్టా పనులు కొనసాగించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. సెంట్రల్‌ విస్టా పనులు నిలిపివేయాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ మేరకు ప్రమాణపత్రం సమర్పించింది. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌ను ఆపడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే ఈ పిటిషన్‌ దాఖలైందని పేర్కొంది. ఎన్నో ఏజెన్సీలు నిర్మాణాలు చేపడుతుండగా.. పిటిషనర్‌ కేవలం దీన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడాన్ని బట్టి అతడి ఉద్దేశమేమిటో అర్థమవుతోందని అఫిడవిట్‌లో పేర్కొంది.

‘‘దేశ రాజధాని దిల్లీలో మెట్రో సహా అనేక నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఒకేసారి ఇన్ని రకాల నిర్మాణ పనులు జరుగుతున్నా పిటిషనర్‌ కేవలం ఈ ప్రాజెక్ట్‌ గురించే పిటిషన్‌ దాఖలు చేయడం వెనుక అసలు ఉద్దేశం అర్థమవుతోంది’’ అని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. కర్ఫ్యూ సమయంలో నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా దిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అనుమతిస్తోందని పేర్కొంది. వీరంతా నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే ఉంటున్నారని, పైగా కర్ఫ్యూ కంటే ముందే అక్కడకు చేరుకున్నారని తెలిపింది. కూలీలు సైతం పనులు చేసేందుకు అంగీకారం తెలిపారని, కొవిడ్‌ నిబంధనలకు లోబడి పనులు జరుగుతున్నాయని అఫిడవిట్‌లో పేర్కొంది. వేరే చోటు నుంచి కూలీలను తరలిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది.

కర్ఫ్యూ సమయంలో సెంట్రల్‌ విస్టా పనులను కొనసాగించడంపై అనన్య మల్హోత్రా, సోహైల్‌ హష్మీ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సమయంలో నిర్మాణ పనులు చేపడితే కూలీలు కరోనా బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నరు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌ ఈ నెల 12న విచారణ చేపట్టనున్నారు. తొలుత ఇదే అంశంపై పిటిషనర్లు దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణను 17కు వాయిదా వేసింది. దీంతో వారు సుప్రీంను ఆశ్రయించారు. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్లకు సూచించింది. దీంతో మరోసారి అత్యవసర చేపట్టాలని విన్నవించిన నేపథ్యంలో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని