డీపీఆర్‌ ఆధారంగానే రైల్వే కారిడార్ల ఆమోదం

తాజా వార్తలు

Published : 10/03/2021 17:17 IST

డీపీఆర్‌ ఆధారంగానే రైల్వే కారిడార్ల ఆమోదం

లోక్‌సభలో రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు నూతన హై స్పీడ్‌ రైల్‌ కారిడార్ల డీపీఆర్‌ రూపకల్పన బాధ్యతను భారతీయ రైల్వేకు అప్పగించినట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క కారిడార్‌ డీపీఆర్‌ కూడా పూర్తికాలేదని గోయల్‌ తెలిపారు. డీపీఆర్‌లో పొందుపర్చిన అంశాల ఆధారంగా కారిడార్లను ఆమోదిస్తామని స్పష్టం చేశారు.

దేశంలో ముంబయి- అహ్మదాబాద్‌తో పాటు దిల్లీ-నోయిడా-ఆగ్రా-లక్నో-వారణాసి; దిల్లీ-జైపుర్‌-ఉదయ్‌పుర్‌-అహ్మదాబాద్‌; ముంబయి-నాసిక్‌-నాగ్‌పుర్‌; ముంబయి-పుణె-హైదరాబాద్‌; చెన్నై-బెంగళూరు-మైసూరు; దిల్లీ-చండీగఢ్‌-లుథియానా-జలంధర్‌-అమృతసర్.. ఇలా  మొత్తంలో ఏడు హైస్పీడ్‌ రైలు కారిడార్‌లను గుర్తించినట్లు అప్పటి రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. ముంబయి- అహ్మదాబాద్‌ మార్గంలో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన మార్గాల్లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుపుతామని తెలిపారు. వీటికి డీపీఆర్‌లు సిద్ధం చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని