కరోనా ఎఫెక్ట్‌: అక్కడ ప్రార్థనా మందిరాలు మూసివేత!

తాజా వార్తలు

Updated : 19/03/2021 15:48 IST

కరోనా ఎఫెక్ట్‌: అక్కడ ప్రార్థనా మందిరాలు మూసివేత!

నాందేడ్‌: కరోనా వైరస్‌ దేశంలో మళ్లీ కోరలు చాస్తుండటంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.  తాజాగా మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు జిల్లాలోని ప్రార్థనా మందిరాలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. భక్తుల రద్దీ నియంత్రించడం ద్వారా వైరస్‌ను కట్టడి చేసేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అయితే, రోజువారీ జరగాల్సిన పూజా కార్యక్రమాలు జరిగేలా ఆయా ఆలయ సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంటూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ విపిన్‌ ఇతంకర్‌ ఉత్తర్వులు జారీచేశారు. నాందేడ్‌ జిల్లాలో దుకాణాలకు సైతం పలు నిబంధనలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనుమతిస్తున్నట్టు తెలిపారు. అత్యవసర సేవలకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవని పేర్కొంటూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నాందేడ్‌లో గురువారం 625 కొత్త కేసులు రాగా.. ముగ్గురు మరణించారు. దీంతో ఆ జిల్లాలో మొత్తం కేసులు 29,145కి చేరగా.. మరణాల సంఖ్య 627కి పెరిగింది. ప్రస్తుతం అక్కడ 3,727 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని