IRCTC: రైల్వే టికెట్‌ బుకింగ్‌కు పాన్‌, ఆధార్‌!

తాజా వార్తలు

Published : 25/06/2021 22:09 IST

IRCTC: రైల్వే టికెట్‌ బుకింగ్‌కు పాన్‌, ఆధార్‌!

దిల్లీ: రైల్వే టికెట్‌ బుకింగ్‌లో రాబోయే రోజుల్లో కొత్త మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న దళారీ వ్యవస్థను రూపుమాపడానికి రైల్వే శాఖ సరికొత్త ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్‌ బుకింగ్‌కు పాన్‌, ఆధార్‌ వంటి గుర్తింపు కార్డులను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. గతంలో చేపట్టిన చర్యలు పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ భవిష్యత్‌ కార్యాచరణను వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

టికెట్‌ బుకింగ్‌కు పాన్‌, ఆధార్‌, పాస్‌పోర్ట్‌ వంటి గుర్తింపు కార్డులను తప్పనిసరి చేయడం ద్వారా ప్రయాణికులే టికెట్‌ తీసుకుంటారని, తద్వారా దళారీ వ్యవస్థ అంతమవుతుందని అరుణ్‌ కుమార్‌ చెప్పారు. ఇందుకోసం ఓ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆధార్‌ అధికారులతో సంప్రదింపులు జరిపామని, త్వరలో మిగిలిన గుర్తింపు కార్డుల జారీ యంత్రాంగాలతోనూ చర్చిస్తామని చెప్పారు. 2019 అక్టోంబర్‌ -నవంబర్‌ నుంచి దళారులను పట్టుకోవడం ప్రారంభించామన్నారు. ఈ ఏడాది మే వరకు 14,257 మందిని అరెస్ట్‌ చేసినట్టు చెప్పారు. సుమారు ₹28.34 కోట్ల విలువైన టికెట్లను సీజ్‌ చేసినట్లు తెలిపారు. రైల్వే ప్రయాణికులకు ఆర్పీఎఫ్‌ పెద్దపీట వేస్తోందని, కొవిడ్‌ సమయంలోనూ ప్రయాణికుల రక్షణలో ముందు వరుసలో నిలిచిందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని