Cyclone Yaas: ఆ 3 రాష్ట్రాలకు రూ.1000కోట్లు

తాజా వార్తలు

Published : 28/05/2021 17:45 IST

Cyclone Yaas: ఆ 3 రాష్ట్రాలకు రూ.1000కోట్లు

సాయం ప్రకటించిన ప్రధాని మోదీ

దిల్లీ: దేశ తూర్పుతీరంపై విరుచుకుపడిన ‘యస్‌’ తుపానుతో అల్లాడిపోయిన తీర రాష్ట్రాలు పశ్చిమ్‌ బెంగాల్‌, ఒడిశా, ఝార్ఖండ్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ రాష్ట్రాలకు రూ.1000 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఒడిశాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నేడు విహంగ వీక్షణం చేపట్టిన తర్వాత పీఎంవో ఈ ప్రకటన చేసింది. తుపాను ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ సాయం అందించనున్నట్లు పేర్కొంది. ఇందులో యస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ఒడిశాకు రూ.500 కోట్లు తక్షణమే ఇవ్వనున్నట్లు తెలిపింది. మిగతా రూ.500 కోట్లను బెంగాల్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు అందజేయనున్నట్లు వెల్లడించింది. 

అంతేగాక, తుపాను సంబంధిత ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని మోదీ నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు పీఎంవో కార్యాలయం తెలిపింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను పునర్నిర్మించేందుకు కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని పీఎంవో తెలియజేసింది. తుపాను విధ్వంసాన్ని అంచనా వేసేందుకు కేంద్ర మంత్రుల బృందాన్ని ఆయా రాష్ట్రాలకు పంపుతున్నట్లు తెలిపింది.

ఒడిశా, బెంగాల్‌లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మోదీ నేడు పర్యటించారు. ఈ ప్రాంతాల్లో విహంగ వీక్షణం ద్వారా పరిస్థితులు పరిశీలించారు. అంతకుముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా.. తుపాను కారణంగా తమ రాష్ట్రానికి రూ.15వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఇందుకు సంబంధించిన పత్రాలను నేడు ఆమె ప్రధానికి అందజేసి సాయం కోరారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని