ప్రముఖుల ఉగాది శుభాకాంక్షలు 

తాజా వార్తలు

Updated : 13/04/2021 14:22 IST

ప్రముఖుల ఉగాది శుభాకాంక్షలు 

దిల్లీ: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వారిద్దరూ మంగళవారం తెలుగులో ట్వీట్లు చేసి ప్రజలకు అభినందనలు తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రాష్ట్రపతి ట్వీట్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

భారత ప్రధాని నరేంద్రమోదీ సైతం ట్విటర్‌ ద్వారా తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: జస్టిస్‌ ఎన్వీరమణ 

తెలుగు ప్రజలకు సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని