కోల్‌కతా అగ్నిప్రమాదం బాధాకరం: రాష్ట్రపతి
close

తాజా వార్తలు

Published : 09/03/2021 10:35 IST

కోల్‌కతా అగ్నిప్రమాదం బాధాకరం: రాష్ట్రపతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. కాగా, ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘కోల్‌కతా అగ్నిప్రమాద ఘటన నన్ను కలచి వేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని కోవింద్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకోవడం బాధాకరం. ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతికి గురయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని మోదీ ట్వీట్‌లో వెల్లడించారు.

మరోవైపు అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. పీఎం జాతీయ రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.2లక్షలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొంది. గాయపడిన వారికి రూ.50వేల ఇవ్వనున్నట్లు పీఎం కార్యాలయం ప్రకటించింది.

కోల్‌కతాలోని స్ట్రాండ్‌ రోడ్‌లోని 13 అంతస్తుల భవనంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ భవనంలో తూర్పు, ఆగ్నేయ రైల్వేకు చెందిన కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. వారిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ముగ్గురు రైల్వే అధికారులు, ఓ పోలీసు అధికారి ఉన్నారు. ఇప్పటికే ప్రమాదానికి గల కారణాలపై విచారణను ఆదేశిస్తూ రైల్వే శాఖ మంత్రి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని