G-7: ఒకే భూగ్రహం-ఒకే ఆరోగ్య వ్యవస్థ..మోదీ పిలుపు
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 12:19 IST

G-7: ఒకే భూగ్రహం-ఒకే ఆరోగ్య వ్యవస్థ..మోదీ పిలుపు

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు జరుగుతున్న సామూహిక ప్రయత్నాలకు భారత మద్దతు ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ‘‘వన్‌ ఎర్త్‌-వన్‌ హెల్త్‌’’(ఒకే భూగ్రహం-ఒకే ఆరోగ్య వ్యవస్థ) విధానాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జి-7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా జరిగిన ‘బిల్డింగ్‌ బ్యాక్‌ స్ట్రాంగర్‌-హెల్త్‌’ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో సభ్య దేశాలతో పాటు అతిథి దేశాల అధినేతలు పాల్గొన్నారు.

రెండో దశ కరోనా విజృంభణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భారత్‌కు సరైన సమయంలో అండగా నిలిచినందుకు జి-7 దేశాలతో పాటు, సదస్సులో పాల్గొంటున్న అతిథి దేశాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా విజృంభణ సమయంలో ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, కాన్సన్‌ట్రేటర్ల వంటి వనరుల కొరత ఎదుర్కొన్న భారత్‌కు అమెరికా, బ్రిటన్‌, కెనడా సహా అనేక దేశాలు భారత్‌కు సహకారం అందించిన విషయం తెలిసిందే. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌లో ప్రభుత్వం, పరిశ్రమ రంగం, పౌర సమాజం కలిసికట్టుగా పోరాడుతున్న విధానాన్ని ప్రధాని వివరించారు. అలాగే వివిధ రంగాల్లో భారత్‌కు ఉన్న అనుభవం, నైపుణ్యాన్ని.. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

భవిష్యత్ మహమ్మారులను నివారించడానికి ప్రపంచ ఐక్యత, నాయకత్వం, సహకారం కావాలని మోదీ జి-7 వేదికగా పిలుపునిచ్చారు. ఆ బాధ్యత ప్రజాస్వామ్య, పారదర్శక దేశాలపైనే ఉందని నొక్కి చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని