తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది: మోదీ
close

తాజా వార్తలు

Updated : 28/02/2021 12:59 IST

తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది: మోదీ

ఆ భాష సాహిత్యం అద్భుతమన్న మోదీ

దిల్లీ: నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని భారత ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో.. ముందుగానే నీటి సంరక్షణపై దృష్టి సారించాలని ఆయన నొక్కి చెప్పారు. ఈ మేరకు మోదీ ఆదివారం నిర్వహించిన 74వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రసంగించారు. నీటి సంరక్షణ, సైన్స్‌ ప్రాధాన్యం, ఆత్మ నిర్భర్‌‌ భారత్‌ సహా పలు విషయాల గురించి ఆయన ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. నీటి సంరక్షణ పట్ల ప్రతిఒక్కరూ తమ బాధ్యతను తెలుసుకోవాలని మోదీ తెలిపారు. మరికొన్ని రోజుల్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వర్షం నీటిని ఒడిసి పట్టేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘క్యాచ్‌ ది రెయిన్‌’ అనే ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది అన్నారు. 

ప్రముఖ కవి సంత్‌ రవిదాస్‌ చెప్పిన మాటల్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘ఏదైనా పనిచేసేటప్పుడు.. ఏం ఆశించకుండా చేయండి.. అది పూర్తయినపుడు ఎంతో సంతృప్తినిస్తుంది’ అనే రవిదాస్‌ మాటను మోదీ చెప్పారు. దేశ యువతలోని ప్రయోగాత్మక స్ఫూర్తిని ప్రశంసించిన.. రవిదాస్‌ నేటి యువతను చూస్తే ఎంతో సంతృప్తి చెందేవారని అన్నారు. ఈ మాఘ మాసంలో మనం హరిద్వార్‌లో కుంభమేళా జరుపుకుంటున్నాం.. అదేవిధంగా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని గుర్తు చేశారు. ఇలా కలిసి రావడం నీటి ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు.  

ఆత్మనిర్బర్‌ భారత్‌ జాతీయ స్ఫూర్తి..

ఫిబ్రవరి 28, జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేశంలో సైన్స్‌ అభివృద్ధి కోసం సీవీ రామన్‌ చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆత్మనిర్బర్‌ భారత్‌లోనూ సైన్స్‌ సహకారం పాత్ర ప్రబలంగా ఉందన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ కేవలం భారత ప్రభుత్వ ప్రయత్నం కాదని.. ఇది భారత జాతీయ స్ఫూర్తి అని చెప్పారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం అసోంలోని ఆలయాలు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మోదీ లద్ధాఖ్‌లో ఎత్తైన ప్రాంతంలో సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేస్తున్న రైతు ఉర్గోన్‌ ఫుత్సంగ్‌ను ప్రశంసించారు. ఆయన 20 వేర్వేరు పంటల్ని సేంద్రీయ పద్దతుల్లో పండించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఒక పంట వ్యర్థాల్ని మరో పంటకు ఎరువుగా ఉపయోగించాడాన్ని మోదీ అభినందించారు. 

ప్రమోద్‌జీ ఆలోచన అద్భుతం

‘ఆత్మనిర్భర్‌ భారత్‌కు దేశవ్యాప్తంగా చాలా మంది సహకరిస్తున్నారు. అందుకు బిహార్‌లోని బెట్టియాకు చెందిన ప్రమోద్‌జీ సరైన ఉదాహరణ. ఆయన గతంలో దిల్లీలోని ఎల్‌ఈడీ బల్బుల పరిశ్రమలో పనిచేసేవారు. క్రమంగా అతడు బల్బులు తయారు చేసే విధానం నేర్చుకుని ఇప్పుడు తన సొంతూరులో చిన్న స్థాయిలో ఎల్‌ఈడీ బల్బుల పరిశ్రమను స్థాపించారు’ అని మోదీ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషగా పేరున్న తమిళంను నేర్చుకోలేకపోయినందుకు మోదీ పశ్చాత్తాపం తెలియజేశారు. తమిళ సాహిత్యం ఎంతో అద్భుతంగా ఉంటుందని ప్రశంసించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని