close

తాజా వార్తలు

Updated : 07/08/2020 11:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్త విద్యావిధానం భావితరాలకు ఉపయుక్తం

ప్రధాని మోదీ

దిల్లీ: నూతన విద్యా విధానం సవాలుతో కూడుకున్నదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. జాతీయ నూతన విద్యావిధానంలో సంస్కరణలపై నిర్వహించిన సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. విద్యావిధానంపై నాలుగైదేళ్లుగా అనేక మందితో చర్చలు జరిపి జాతీయ విద్యావిధానంలో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. దీనిపై ఎంత ఎక్కువగా చర్చ జరిగితే దేశానికి అంత ప్రయోజనం ఉంటుందన్నారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తెచ్చామని, కొత్త విద్యావిధానం భావితరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మోదీ వివరించారు. విద్యావిధానంలో సంస్కరణలు తీసుకువస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

‘‘21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యాలు ఎంతో అవసరం. గతంలో ఉన్న శిక్షణ వ్యవస్థ పూర్తి సాధికారత సాధించలేదు. నిశిత పరిశీలన ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించాలి. ఏం ఆలోచిస్తున్నారనే దాని  నుంచి ఎలా ఆలోచిస్తున్నారనే దానిపై దృష్టి సారించాలి. పిల్లలు ఐదో తరగతి వరకు మాతృభాషలోనే చదువుకు వెసులుబాటు. నూతన విధానంలో పిల్లల మనో వికాసం మరింత వృద్ధి చెందుతుంది. పిల్లలు తమకు నచ్చిన కోర్సు చదువుకోవచ్చు. విద్యార్థులు వారి లక్ష్యం చేరుకునేందుకు నూతన విద్యావిధానం సాయం చేస్తుంది. పిల్లల్లో మనో వికాసం పెంచే సిలబస్‌ మాత్రమే ఉండాలి. పాత విధానంలో సిలబస్‌ చాలా ఎక్కువగా ఉంది. సిలబస్‌ పేరుతో భారీ పుస్తకాలు అవసరం లేదు. వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించేలా విద్యావిధానం ఉండాలి. జాతీయ విలువలు, సంస్కరణల దిశగా ప్రతి దేశం ముందుకెళ్తోంది. ఆ దిశగా ప్రతిదేశం తమ విద్యావిధానంలో మార్పులు చేసుకుంటోంది’’ అని మోదీ సూచించారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.