దీదీ..ఇది 2021: మోదీ

తాజా వార్తలు

Published : 10/04/2021 18:12 IST

దీదీ..ఇది 2021: మోదీ

కోల్‌కతా: తదుపరి దశ పోలింగ్‌ నిమిత్తం పశ్చిమ్ బెంగాల్‌లో ప్రధాని నరేంద్రమోదీ, తృణమూల్ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తమ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతంగా నిర్వహిస్తున్నారు. మమతకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారని కృష్ణానగర్‌లో జరిగిన సభలో ప్రధాని వ్యాఖ్యానించారు. ఆమె భాజపాను ఓడించగలదేమో కానీ.. ప్రజలను కాదంటూ విమర్శలు చేశారు. అలాగే ఈ రోజు నాలుగో దశ పోలింగ్ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనను ప్రస్తావించారు. 

‘దీదీ కేంద్ర బలగాలను నిందించారు. ఈవీఎంలను అనుమానించారు. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే.. సొంత పార్టీకే చెందిన పోలింగ్ ఏజెంట్లను తప్పుపట్టడం ప్రారంభించారు. దీదీ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆమె బెంగాల్ ఓటర్లను అపఖ్యాతి పాలు చేస్తున్నారు. వారు ఇక మీ నుంచి సున్నితత్వాన్ని ఆశించరు’ అంటూ ప్రధాని మమత వైఖరిని తప్పుపట్టారు. తృణమూల్ ప్రభుత్వం రాష్ట్రవాసులకు నిరుద్యోగం, లాఠీలు, అవమానాలు, కొట్లాటలనే బహుమతిగా ఇచ్చిందని ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారు. ‘మమతాజీ, ఇది 2021. ప్రజాస్వామ్యంతో ఆడుకోవడానికి మీకు ఇక కుదరదు. ప్రజలను భయ పెట్టాలని మీరు ఎంతగా ప్రయత్నిస్తున్నారో.. వారు అంతగా మిమ్మల్ని ఓడించాలని చూస్తున్నారు. మీకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది బెంగాల్ ప్రజలు. మీరు భాజపాను ఓడించవచ్చు. కానీ ప్రజలను ఎలా ఓడిస్తారు?’ అంటూ మండిపడ్డారు. ఆ రాష్ట్రంలో ఈ రోజు నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది. దానిలో భాగంగా కూచ్‌బిహార్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘర్షణల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని