Modi's Suit: అత్యంత ఖరీదైన ‘మోదీ సూట్‌’.. ఇప్పుడు బుల్లెట్‌ ప్రూఫ్‌ బాక్స్‌లో!

తాజా వార్తలు

Published : 15/08/2021 02:07 IST

Modi's Suit: అత్యంత ఖరీదైన ‘మోదీ సూట్‌’.. ఇప్పుడు బుల్లెట్‌ ప్రూఫ్‌ బాక్స్‌లో!

సూరత్‌: 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధరించిన సూట్ గుర్తుందా? ‘మోదీ సూట్’​గా వార్తల్లోకెక్కిన ఆ సూట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గిన్నిస్ రికార్డు సాధించింది. రూ. 4.31కోట్లకు ఓ వజ్రాల వ్యాపారి దాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ సూట్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ బాక్స్‌లో అత్యంత భద్రంగా ఉంది.

2015లో గణతంత్ర దినోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు భారత్ ఘనమైన ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధరించిన సూట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వార్తల్లో పతాక శీర్షికలకెక్కింది. అదే ఏడాది ఫిబ్రవరి 20న ఆ సూట్‌ను వేలం వేయగా.. మోదీపై అభిమానంతో సూరత్​కు చెందిన వజ్రాల వ్యాపారి లాల్జీభాయ్‌ పటేల్‌ దాన్ని సొంతం చేసుకున్నారు. రూ.11 లక్షలకు వేలం వేస్తే ఏకంగా రూ.4.31 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో అది అత్యంత ఖరీదైన సూట్‌గా గిన్నిస్‌ రికార్డులకెక్కింది.

లాల్జీ పటేల్ కొనుగోలు చేసిన మోదీ సూట్ ప్రస్తుతం ఓ ఫ్యాక్టరీలో ఉంది. చాలా జాగ్రత్తగా దాన్ని సంరక్షిస్తున్నారు. అత్యంత సురక్షితమైన, అత్యాధునిక సాంకేతికతతో బుల్లెట్ ప్రూఫ్ బాక్స్​లో ఆ సూట్​ను ఉంచారు. మోదీ రూపంలో విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి ఈ సూట్‌ను తొడిగి ఆ బాక్స్‌లో భద్రపరిచారు. ఒబామా వచ్చినప్పుడు తీసిన ఫొటోల్లో మోదీ ఎలా ఉన్నారో అదే విధంగా ఈ విగ్రహాన్ని రూపొందించడం విశేషం. సూట్​ను కొనుగోలు చేసిన తర్వాత దాన్ని సంరక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, చాలా జాగ్రత్తగా సంరక్షిస్తున్నట్లు లాల్జీభాయ్ పటేల్ తెలిపారు. ఈ సూట్​ను ఏడాదికి రెండు సార్లు శుభ్రం చేస్తామని, తన ఇంట్లోని పనివారే జాగ్రత్తగా ఈ పని చేస్తారని వజ్రాల వ్యాపారి పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని