కొవిడ్ ఉద్ధృతి.. మరోసారి సీఎంలతో మోదీ భేటీ 

తాజా వార్తలు

Published : 05/04/2021 17:38 IST

కొవిడ్ ఉద్ధృతి.. మరోసారి సీఎంలతో మోదీ భేటీ 

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఏప్రిల్‌ 8న గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంలతో భేటీ కానున్న ప్రధాని.. కొవిడ్‌ తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ సంబంధిత అంశాలపై చర్చించనున్నట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి. 

కరోనా పరిస్థితులపై మోదీ.. సీఎంలతో సమావేశం నిర్వహిస్తుండటం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. గతేడాది కరోనా ఉద్ధృతి సమయంలోనూ పలుమార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ప్రధాని.. ఈ ఏడాది జనవరిలో టీకా పంపిణీ ప్రారంభానికి ముందు కూడా సీఎంలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మార్చి 17న కూడా ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించిన మోదీ.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. 

దేశంలో కరోనా రెండో ఉద్ధృతి తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని ప్రధాని ఈ సందర్భంగా నిర్దేశించారు.  టెస్టింగ్‌ (పరీక్షలు జరపడం); ట్రేసింగ్‌ (బాధితులకు సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించడం); ట్రీట్‌మెంట్‌ (చికిత్సలు); కొవిడ్‌ జాగ్రత్తలు, నిబంధనలను పాటించడం; వ్యాక్సినేషన్‌.. ఈ పంచముఖ వ్యూహాన్ని అత్యంత నిబద్ధతతో, కట్టుదిట్టంగా అమలుచేస్తేనే మహమ్మారి నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని