కొవిడ్‌ టీకాపై భయం తొలగించాలి: మోదీ
close

తాజా వార్తలు

Published : 22/01/2021 15:39 IST

కొవిడ్‌ టీకాపై భయం తొలగించాలి: మోదీ

‘వ్యాక్సిన్‌’ అనుభవాలు తెలుసుకున్న ప్రధాని

లఖ్‌నవూ: కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకొచ్చిన టీకాల సమర్థత, భద్రతపై నెలకొన్న భయాలు, అపోహలను పారద్రోలాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో కరోనా టీకా తీసుకున్న లబ్ధిదారులు, వ్యాక్సిన్‌ వేసే సిబ్బందితో మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. వారి నుంచి టీకా అనుభవాలను తెలుసుకున్నారు. 

‘‘ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశంలో కొనసాగుతోంది. కరోనా పోరులో ముందున్న ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తొలి దశలో టీకాలు తీసుకుంటున్నారు. టీకా సామర్థ్యంపై డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు చెబితేనే ప్రజల్లోకి గట్టి సందేశం వెళ్తుంది. టీకాపై అపోహలను తొలగించండి’ అని మోదీ హెల్త్‌ వర్కర్లను కోరారు. 

ఈ ఘనత శాస్త్రవేత్తలదే..

ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘ప్రజలెవరూ బయటకు రాలేని అత్యవసర పరిస్థితుల్లో మీరు(వైద్య సిబ్బంది) విధులు నిర్వర్తించారు. ప్రజలకు సేవ చేశారు. అందుకే టీకా తీసుకోవడంలో మీరే తొలి హక్కుదారులు. ఇక శాస్త్రవేత్తలు కూడా రేయింబవళ్లు కష్టపడి టీకాలను అభివృద్ధి చేశారు. ఇదంతా శాస్త్రవేత్తల ఘనతే. వారి వల్లే ఈ రోజు మనం రెండు స్వదేశీ టీకాలను అందుబాటులోకి తీసుకురాగలిగాం.’’ అని మోదీ చెప్పుకొచ్చారు.

వ్యాక్సిన్లు ఎప్పుడు తీసుకొస్తారని చాలా మంది తనను అడిగారని మోదీ అన్నారు. అయితే వేగంతో పాటు సమర్థతకే తాము ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. సుదీర్ఘకాలం కఠిన ప్రక్రియ తర్వాతే వ్యాక్సిన్లకు ఆమోదముద్ర వేశామని, టీకాల సమర్థతపై ఎలాంటి అపోహాలు అవసరం లేదని మోదీ తెలిపారు. 

ఇవీ చదవండి..

టీమిండియా నుంచి స్ఫూర్తి పొందండి: మోదీ

సీరం ప్రమాదంపై ఐరాస విచారం!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని