అభివృద్ధికి ప్రతిఫలం ఇదేనా

తాజా వార్తలు

Published : 27/02/2021 16:53 IST

అభివృద్ధికి ప్రతిఫలం ఇదేనా

దిల్లీ: దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న ప్రధాని మోదీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులను కలిసేందుకు సమయమేలేదా..? అని కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరం ప్రశ్నించారు. గత మూడు నెలలుగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వం తీరును విమర్శిస్తూ ఆయన శనివారం వరుస ట్వీట్లు చేశారు. ‘‘దేశం మాంద్యంలో మునిగి ఉన్నప్పుడు కూడా వ్యవసాయరంగం 3.9శాతం వృద్ధిని నమోదు చేసింది. కానీ, రైతులకు దక్కిన ప్రతిఫలం ఏంటంటే.. ప్రభుత్వం వారిని శత్రువులుగా చూడటం.’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. కేరళ, అసోం రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రధానికి సమయం ఉంది. కానీ, రైతులను కలిసేందుకు 20 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సమయం లేదని చిదంబరం అన్నారు.

‘‘ ఈ నూతన వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని, కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) అందరికీ దక్కుతుందని కేంద్రం చెబుతోంది. కానీ, నిజానికి దేశంలోని 6శాతం ప్రజలకు మాత్రమే ఎంఎస్‌పీ అందుతోంది.’’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ గతంలోనే ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రైతులకు మద్దతుగా పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కేంద్రం ప్రతిపాదనకు రైతులు అంగీకరిస్తే వారితో చర్చలు జరిపేందుకు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని