Indo-Pak border: పంజాబ్‌లో భారీగా ఆయుధాలు, డ్రగ్స్‌ స్వాధీనం

తాజా వార్తలు

Updated : 21/10/2021 04:19 IST

Indo-Pak border: పంజాబ్‌లో భారీగా ఆయుధాలు, డ్రగ్స్‌ స్వాధీనం

చండీగఢ్‌: పంజాబ్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో అధికారులు భారీగా ఆయుధాలు, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌ సరిహద్దులోని తార్న్‌తరణ్‌ జిల్లా ఖేంకరన్‌ ప్రాంతంలో వీటిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అమృత్‌సర్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో 22 తుపాకులు, 44 మ్యాగజీన్లు, 100 రౌండ్ల తూటాలతో పాటు కిలో హెరాయిన్‌ సీజ్‌ చేసినట్టు తెలిపారు. వీటిని నల్లరంగుతో ఉన్న కిట్‌ బ్యాగ్‌తో వరిపొలంలో దాచి ఉంచారన్నారు. తమకు వచ్చిన రహస్య సమాచారం ఆధారంగా ఈ సంయుక్త ఆపరేషన్‌ జరిపి వాటిని స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ ఇక్బాల్‌ ప్రీత్‌ సింగ్‌ సహోట వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది పాకిస్థాన్‌ స్మగ్లర్ల పనిగా తెలుస్తోందన్నారు. దీనిపై అమృత్‌సర్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు.

పాకిస్థాన్‌ సరిహద్దుల్లోంచి ఇలాంటి పదార్థాలు మన దేశంలోకి వివిధ మార్గాల ద్వారా చొప్పించే ప్రయత్నాలు ఇదే తొలిసారి కాదు.  గతంలో కూడా కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో కూడా 48 విదేశీ తుపాకులను బాటాలాలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, మధ్యప్రదేశ్‌లో జరిపిన మరో ఆపరేషన్‌లో 39 తుపాకీలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని