Covishield: పేరుతో చిక్కు వచ్చింది.. పరిష్కరించండి..!

తాజా వార్తలు

Published : 28/06/2021 14:58 IST

Covishield: పేరుతో చిక్కు వచ్చింది.. పరిష్కరించండి..!

కేంద్రాన్ని కోరిన అదర్ పూనావాలా

దిల్లీ: కొవిషీల్డ్ టీకా తీసుకున్నవారికి ఐరోపా సంఘం(ఈయూ) దేశాల్లో పర్యటించే విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయనే వార్తల నేపథ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా స్పందించారు. ట్విటర్ వేదికగా భారత్‌ ప్రయాణికులకు భరోసా ఇచ్చారు. ‘కొవిషీల్డ్ తీసుకున్న భారతీయులు ఐరోపా దేశాలకు ప్రయాణించే విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నాకు తెలిసింది. దీనిని ఉన్నత స్థాయి వర్గాల దృష్టికి తీసుకెళ్లాను. ఆయా దేశాలకు చెందిన నియంత్రణ సంస్థలు, దౌత్య స్థాయిలో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం’ అని అదర్ ట్వీట్ చేశారు. 

భారతదేశంలో తయారైన కొవిషీల్డ్ టీకా తీసుకున్న ప్రయాణికులు ఐరోపా సంఘం(ఈయూ) జారీ చేసే గ్రీన్‌పాస్‌కు అర్హత పొందకపోవచ్చని వార్తలు వచ్చాయి. టీకా పొందిన విదేశీయులను అనుమతించే నిమిత్తం ఈయూకి చెందిన యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ నాలుగు టీకాలను ఆమోదించింది. అవి.. ఫైజర్, మోడెర్నా, వాక్సెవ్రియా (ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా), జాన్‌సెన్ (జాన్సన్&జాన్సన్)టీకాలు. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన టీకాను ఐరోపాలో వాక్సెవ్రియాగా.. భారత్‌లో కొవిషీల్డ్‌ పేర్లతో విక్రయిస్తున్నారు. అయితే భారత్‌లో ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ను ఈయూకి చెందిన యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ(ఈఎంఏ) గుర్తించలేదు.   

ఈ కరోనా వేళ పౌరులంతా సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా జులై ఒకటి నుంచి ‘డిజిటల్ కొవిడ్ ధ్రువీకరణ’ను ప్రవేశపెట్టాలని ఈయూ భావిస్తోంది. ఆ ధ్రువీకరణపత్రం ఉంటే.. పూర్తిగా టీకాలు పొందారని లేక కొవిడ్ నెగెటివ్‌గా నిర్ధారణ అయిందని లేక వైరస్ నుంచి కోలుకున్నారని అర్థం. అయితే, ప్రస్తుతం నిబంధనల కారణంగా కొవిషీల్డ్ పొందిన భారతీయులు క్వారంటైన్‌లో ఉండాల్సి రావొచ్చు లేక కొవిడ్ కట్టడికి ఆయా దేశాలు అవలంబిస్తోన్న విధానాలను పాటించాల్సి ఉంటుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని