అమెరికా అధ్యక్షుడు టెస్ట్‌డ్రైవ్‌..!

తాజా వార్తలు

Published : 22/05/2021 01:35 IST

అమెరికా అధ్యక్షుడు టెస్ట్‌డ్రైవ్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఓ కారుపై మనసు పడ్డారు. దీంతో ఆయనే స్వయంగా టెస్ట్‌ డ్రైవ్‌ చేసి భేష్‌ అన్నారు. తాను భవిష్యత్తులో ఆ కారును కొనుగోలు చేస్తానని తెలిపారు. ఫోర్డ్‌ ఎఫ్‌-150 పేరుతో ఒక ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి తీసుకురానుంది.  ఈ కారును జో బైడెన్‌ ఇటీవలే టెస్ట్‌ డ్రైవ్‌ చేశారు. సాధారణంగా అమెరికా అధ్యక్షులు కారు డ్రైవ్‌ చేయరు. కానీ, జో దీని కోసం స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన కారును గంటకు 80 మైళ్ల వేగంతో పరుగులు పెట్టించారు. అనంతరం మాట్లాడుతూ ‘ఈ కారు చాలా వేగంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు.  ఇది గంటలకు 4.4 సెకన్లలో 0-60 మైళ్ల వేగాన్ని అందుకోగలదని.. భవిష్యత్తులో తాను ఈ కారును కొనుగోలు చేస్తానని వెల్లడించారు. ఇది ఎలక్ట్రిక్‌ కారు కావడం విశేషం.  

బైడెన్‌ డ్రైవ్‌ చేసిన కారు ఫీచర్లు బయటకు కనిపించచకుండా కెమోఫ్లాజ్‌ చేశారు. ఈ కారు అత్యధిక వేగం గంటకు 300 మైళ్లు ఉండొచ్చని .. ఇది 500 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుందని అంటున్నారు.  బైడెన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల అభిమాని. ఆయన ట్రంప్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పారిస్‌ ఒప్పందంలోకి అమెరికాను తీసుకెళ్లారు. మిషిగాన్‌లోని ట్రాక్‌పై ఈ కారు టెస్ట్‌డ్రైవ్‌ సందర్భంగా ఆయన ఫోర్డ్‌తో  174 బిలియన్‌ డాలర్ల ఎలక్ట్రిక్‌ ప్రణాళికను చర్చించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని