25న జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రపతి

తాజా వార్తలు

Published : 18/07/2021 23:46 IST

25న జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రపతి

దిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 25 నుంచి మూడు రోజుల పాటు జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలు ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు ఆదివారం వెల్లడించాయి. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకొని ద్రాస్‌ సెక్టార్‌లోని యుద్ధ స్మారకం వద్ద 26న నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు పేర్కొన్నాయి. కశ్మీర్‌లో ఆయన పలు వేడుకలు సహా ఓ విద్యాసంస్థలో నిర్వహించే స్నాతకోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. అయితే ఆయన పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్‌డీజీ భద్రతా విభాగం ఎస్‌డీ సింగ్‌ జమ్వాల్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని