అంబేడ్కర్‌ ఆలోచనలు ఎందరికో స్ఫూర్తి: రాష్ట్రపతి

తాజా వార్తలు

Updated : 14/04/2021 11:49 IST

అంబేడ్కర్‌ ఆలోచనలు ఎందరికో స్ఫూర్తి: రాష్ట్రపతి

దిల్లీ: సమాజంలో అసమానతలు తొలగించేందుకు భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డా. బీఆర్‌ అంబేడ్కర్‌ జీవితకాలం కృషి చేశారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. నేడు అంబేడ్కర్‌ 130వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ ఆయనకు ట్విటర్‌ వేదికగా నివాళులు అర్పించారు. ‘భారత రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళులు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు ఆయన జీవితకాల పోరాటం చేశారు. ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని మన జీవితంలో మార్పులకు సంకల్పించాలి’ అని రాష్ట్రపతి ట్వీట్‌లో వెల్లడించారు.

‘భారతరత్న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్‌ చేసిన పోరాటం ప్రతి తరానికి ఉదాహరణగా నిలుస్తుంది’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని