Pegasus: ఏమో.. మా ఫోన్ నంబర్లూ హ్యాక్‌ చేశారేమో!
close

తాజా వార్తలు

Published : 23/07/2021 01:25 IST

Pegasus: ఏమో.. మా ఫోన్ నంబర్లూ హ్యాక్‌ చేశారేమో!

రైతు సంఘాల నేతల అనుమానం

దిల్లీ: పెగాసస్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ కేంద్రం తమపైనా నిఘా ఉంచి ఉండొచ్చని రైతు సంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలోని జంతర్‌ మంతర్‌వద్ద 200 మంది రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పెగాసస్‌ వ్యవహారం పార్లమెంట్‌ ఉభయ సభలను కుదిపేస్తుండటంతో తమ ఫోన్లను కూడా హ్యాకింగ్‌ చేశారేమోనని రైతు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది అనైతిక ప్రభుత్వమని, పెగాసస్‌తో నిఘా పెట్టిన ఫోన్‌ నంబర్ల జాబితాలో తమ నెంబర్లు కూడా ఉంటాయన్న అనుమానం వస్తోందని రైతు నేత శివకుమార్‌ కక్కా అన్నారు. 2020-21 ఏడాది డేటాలో రైతు నేతల ఫోన్‌ నంబర్లు ఉండే అవకాశం ఉందని స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ అన్నారు. ఈ డేటాను బహిరంగ పరిస్తే తమ నంబర్లు కూడా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. యూకే పార్లమెంట్‌లో తమ సమస్యలపై చర్చిస్తున్నా ఇక్కడ మాత్రం చర్చించడంలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు లేవనెత్తుతున్న అంశాలపై పార్లమెంట్‌లో చర్చించాలన్నారు. 

తమ డిమాండ్లను ఉభయ సభల్లో లేవనెత్తాలని కోరుతూ ఎంపీలందరికీ లేఖలు రాశామని, కానీ ఆ అంశాలను పార్లమెంట్‌ తీసుకోవడం లేదని మరో రైతు ఉద్యమ నేత హన్నాన్‌ మొల్లా తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు 200 మంది రైతులతో కూడిన బృందం గురువారం జంతర్‌ మంతర్‌ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు.

పార్లమెంట్‌ భవనానికి సమీపంలోని జంతర్‌ మంతర్‌ వద్ద రైతులు నిరసన తెలుపుకొనేందుకు దిల్లీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. 200మంది రైతులకు మించకుండా ఆగస్టు 9వరకు జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు తెలుపుకోవచ్చని స్పష్టంచేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని