18న దేశవ్యాప్తంగా ‘రైల్‌ రోకో’! 

తాజా వార్తలు

Updated : 10/02/2021 20:18 IST

18న దేశవ్యాప్తంగా ‘రైల్‌ రోకో’! 

నాలుగు గంటల కార్యక్రమానికి ఎస్‌కేఎం పిలుపు

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతు సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. ఇటీవల జాతీయ/ రాష్ట్ర రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘాల నేతలు.. తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. సింఘూ సరిహద్దు వద్ద సమావేశమైన సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నాలుగు గంటల (మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు) పాటు దేశవ్యాప్తంగా రైళ్లను అడ్డుకోవాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే, ఈ నెల 12 నుంచి రాజస్థాన్‌లోని అన్ని టోల్‌ ప్లాజాల వద్ద టోల్‌ కలెక్షన్‌ను కొనసాగనీయబోమని తెలిపింది. పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నివాళిగా ఈ నెల 14న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు దిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకు పైగా పోరాటం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

ఆ రైతులెవరికీ ఎన్‌ఐఏ సమన్లు ఇవ్వలేదు 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని