మయన్మార్‌లో నిరసనలపై ఉక్కుపాదం

తాజా వార్తలు

Published : 14/02/2021 01:32 IST

మయన్మార్‌లో నిరసనలపై ఉక్కుపాదం

సైబర్‌ భద్రత చట్టం ముసాయిదా సిద్ధం 

యంగోన్, జెనీవా: మయన్మార్‌లో పౌర ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం మరో కీలక చర్యకు రంగం సిద్ధం చేసింది. వ్యక్తిగత గోప్యత పరిరక్షణ కోసమని చెబుతూ సరికొత్త సైబర్‌ భద్రత చట్టం ముసాయిదాను తయారు చేసింది. అయితే, గోప్యత పరిరక్షణ ముసుగులో దేశవ్యాప్తంగా నిరసన గళాలను నొక్కేసేలా అందులోని నిబంధనలు ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు- మయన్మార్‌ జాతీయ జెండా దినోత్సవాన్ని సైన్యం శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా మయన్మార్‌ సైన్యాధ్యక్షుడు సీనియర్‌ జనరల్‌ మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం కావాలంటే సైన్యంతో చేతులు కలిపి పనిచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజాస్వామ్యవాదులు ఈ దఫా జెండా దినోత్సవాన్ని బహిష్కరించారు. తమ దేశంలో ప్రతిష్టంభనకు చైనాయే కారణమని వారు ఆరోపించారు. 

ఐరాస మానవ హక్కుల మండలి అత్యవసర భేటీ 

సైనిక తిరుగుబాటుతో మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) దృష్టి సారించింది. ఈ అంశంపై చర్చించేందుకుగాను శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. నిర్బంధంలో ఉన్న అగ్ర నేత ఆంగ్‌ శాన్‌ సూకీ సహా పలువురు నేతల విడుదల కోసం వెల్లువెత్తుతున్న డిమాండ్లపై చర్చించింది.  

ఇవీ చదవండి..
బ్రిటన్‌పై చైనా ప్రతీకారం

ఏడు స్క్రీన్‌లతో ల్యాప్‌టాప్.. చూశారా?
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని