Punjab CM Dance: సీఎం సాబ్‌ డ్యాన్స్‌ చూశారా!

తాజా వార్తలు

Published : 24/09/2021 01:26 IST

Punjab CM Dance: సీఎం సాబ్‌ డ్యాన్స్‌ చూశారా!

పోనిలే.. కొద్దిరోజులు ఎంజాయ్‌ చేయనివ్వండంటూ నెటిజన్లు సెటైర్లు

చండీగఢ్‌: ఈ చిత్రంలో అదరగొట్టే డ్యాన్స్‌ స్టెప్స్‌తో కనిపించేది.. ఏ సినిమా హీరో కాదు, డ్యాన్స్‌ షో జడ్జి కాదు.. కొరియోగ్రాఫర్‌ అంతకన్నా కాదు. ఆయన ఎవరో కాదు పంజాబ్‌ సీఎం, చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీనే. ఈనెల 19న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన ఆయన.. కపుర్తాలాలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఇలా స్టేజీ మీద ‘భాంగ్రా డ్యాన్స్‌’ వేశారు. 58ఏళ్ల ఈ రాజకీయ నేత తనదైన ఎనర్జీతో జానపద నృత్యకారులతో కాలు కదిపి వారిలో ఉత్సాహం నింపారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సామాజిక  మాధ్యమాల్లో వైరల్‌ అవ్వగా.. ‘‘పోనిలే! కొత్తగా వచ్చాడు.. కొన్ని నెలలు ఎంజాయ్‌ చేయనివ్వండి’’ అంటూ ఛలోక్తులు విసిరారు నెటిజన్లు.


 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని