రూ.100 టిక్కెట్‌తో ₹ కోటి గెలుచుకుంది!
close

తాజా వార్తలు

Updated : 26/02/2021 04:37 IST

రూ.100 టిక్కెట్‌తో ₹ కోటి గెలుచుకుంది!

లాటరీ రూపంలో గృహిణిని వరించిన అదృష్టం

అమృత్‌సర్‌: అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. అంతా అలా జరిగిపోతుందంతే..! రూ.100లు పెట్టి కొన్న లాటరీ టిక్కెట్‌ ఓ గృహిణిని రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిని చేసింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అమృత్‌సర్‌కు చెందిన రేణూ చౌహాన్‌ ఇటీవల రూ.100లకు లాటరీ టిక్కెట్‌ కొనుగోలు చేశారు. లాటరీ తీయగా ఆమె టిక్కెట్‌ ప్రైజ్‌ విన్నర్‌గా నిలిచినట్టు పంజాబ్‌ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రాష్ట్ర లాటరీస్‌ డిపార్ట్‌మెంట్‌లో లాటరీ టిక్కెట్‌తో పాటు అవసరమైన దస్త్రాలను అధికారులకు ఆమె గురువారం సమర్పించారు.

భగవంతుడి ఆశీస్సుల వల్లే తనకు ఈ లాటరీ తగిలిందంటూ రేణూ చౌహాన్‌ అమితానందం వ్యక్తంచేశారు. మధ్యతరగతి కుటుంబమైన తనకు ఇదెంతో ఉపశమనం కలిగించిందన్నారు. తన భర్త అమృత్‌సర్‌లో వస్త్ర దుకాణం నడుపుతున్నారని చెప్పారు. ఈ లాటరీ ప్రైజ్‌ మనీ తమ జీవితం మరింత సజావుగా సాగేందుకు దోహదపడుతుందని చెప్పుకొచ్చారు రేణు. ఈ లాటరీ ఫలితాలను ఈ నెల 11న ప్రకటించినట్టు లాటరీ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తెలిపారు. రేణు గెలిచిన టిక్కెట్‌ నంబర్‌ డి-12228 అని, నగదును పొందేందుకు అవసరమైన దస్త్రాలను ఆమె సమర్పించారన్నారు. ప్రైజ్‌ మనీని త్వరలోనే ఆమె బ్యాంకు ఖాతాలో జమచేయనున్నట్టు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని