Oxygen కొరత: పంజాబ్‌ కీలక నిర్ణయం
close

తాజా వార్తలు

Published : 24/04/2021 20:05 IST

Oxygen కొరత: పంజాబ్‌ కీలక నిర్ణయం

అమృత్‌సర్‌: దేశంలో తీవ్ర ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇనుము, ఉక్కు కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. పరిశ్రమలు వినియోగించే ఆక్సిజన్‌ను మెడికల్‌ అవసరాల కోసం ఉపయోగించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. అంతేకాకుండా ఎక్కడిక్కడ కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని,  జిల్లాల వ్యాప్తంగా ఆక్సిజన్ కొరతపై ఎప్పటికప్పుడు రిపోర్టు తయారు చేయాలని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అమరేంద్రసింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఉదయం అమృత్‌సర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సకాలంలో ఆక్సిజన్‌ అందకపోవడంతో ఆరుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అమృత్‌సర్‌ డిప్యూటీ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు. అంతేకాకుండా ఆక్సిజన్‌ కొరత ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లోని పేషెంట్లను దగ్గర్లోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లోకి తరలించాలని కోరారు.

 రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి రాష్ట్రంలో సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు లేవని, ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లానని సీఎం అమరీందర్‌ వెల్లడించారు. రాష్ట్రానికి ఆక్సిజన్‌ కోటా పెంచాలని కోరినట్లు చెప్పారు. ఒక్కసారిగా కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రాణవాయువు కొరత ఏర్పడిందన్నారు. ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే అంశాన్ని పరిశీలించాలని విద్యుత్‌ శాఖను సీఎం ఆదేశించారు.  పంజాబ్‌లో ఆక్సిజన్‌ అవసరం రోజు రోజుకూ పెరిగిపోతోంది. గత కొన్ని రోజులుగా రోజుకు 250 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఖర్చవుతుండగా.. భవిష్యత్‌లో ఇది 300 మెట్రిక్‌ టన్నులకు చేరే అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని