రైతులకు పంజాబ్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ 
close

తాజా వార్తలు

Published : 08/03/2021 23:21 IST

రైతులకు పంజాబ్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ 

₹1186కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ

చండీగఢ్‌: పంజాబ్‌ రైతులకు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.  రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్టు వెల్లడించింది. 2021-22 సంవత్సరానికి గాను రూ.1186 కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో  1.13లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ పంజాబ్‌, హరియాణాకు చెందిన వేలాది మంది రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్న వేళ ఈ ప్రకటన చేసింది.

 మరోవైపు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌ రూ.1,68,015 కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో వృద్ధాప్య పింఛనును రెట్టింపు చేశారు.  గతంలో ప్రతి నెలా రూ.750 చొప్పున ఇస్తుండగా.. దాన్ని రూ.1500లకు పెంచుతున్నట్టు వెల్లడించారు. ప్రపంచ మహిళా దినోత్సవానికి ప్రతీకగా దేశ పురోభివృద్ధిలో మహిళల సేవలను కొనియాడుతూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని