close

తాజా వార్తలు

Published : 05/03/2021 23:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాజపా అంటే.. జనాలపై భారం వేసే పార్టీ

ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ విమర్శలు

దిల్లీ: పెట్రోల్‌, వంటగ్యాస్‌, నిత్యావసరాల ధరలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌ ప్రచారం మొదలుపెట్టిన హస్తం పార్టీ.. భాజపా అంటే ప్రజలపై భారం మోపే పార్టీ అంటూ ఎద్దేవా చేసింది. 

‘‘BJP = Burden the Janta, Party(జనాలపై భారం వేసే పార్టీ). వారి దోపిడీపై మనం ఎంత త్వరగా గళమెత్తితే అంత తొందరగా దేశం బాగుపడుతుంది’’ అని కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా SpeakUpAgainstPriceRise హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్‌ ప్రచారం ప్రారంభించిన పార్టీ.. తమ ఉద్యమంలోకి రావాలంటూ పిలుపునిచ్చింది. చమురు, వంటగ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలంటూ కాంగ్రెస్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేసింది.

ద్రవ్యోల్బణం ఒక శాపం: రాహుల్‌

ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా ట్విటర్‌ వేదికగా ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ‘‘ద్రవ్యోల్బణం ఒక శాపం. కేవలం పన్ను ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఈ స్థితిలోకి నెట్టేస్తోంది. ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా మనమంతా గళమెత్తాలి’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా ఆయన పోస్ట్‌ చేశారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని