Rahul: త్వరగా వ్యాక్సిన్‌ వేయించుకోండి
close

తాజా వార్తలు

Published : 15/06/2021 22:41 IST

Rahul: త్వరగా వ్యాక్సిన్‌ వేయించుకోండి

ట్విటర్‌లో రాహుల్‌ గాంధీ

దిల్లీ: దేశంలోని ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ట్వీట్‌ చేశారు. ‘‘ దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ జరుగుతోంది. కానీ కరోనా వైరస్‌ ఇంకా మన మధ్యనే ఉంది. ఉంటుంది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కరోనా నియమావళిని పాటిస్తూ, వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోండి. ప్రస్తుతం ఎవ్వరూ సురక్షితంగా లేరు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.’’ అని రాహుల్‌ గాంధీ హిందీలో ట్వీట్‌ చేశారు. ప్రతి ఒక్కరూ టీకా పంపిణీకి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ తర్వాత ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ సహా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ సడలింపులను ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 9,12,378 క్రియాశీల కేసులున్నాయి. రికవరీ రేటు 95.43కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్యలో కాస్త పెరుగుదల నమోదవుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని