రాజస్థాన్‌ సీఎంకు కరోనా

తాజా వార్తలు

Updated : 29/04/2021 13:29 IST

రాజస్థాన్‌ సీఎంకు కరోనా

జైపూర్‌: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. గెహ్లోత్‌ సతీమణి సునితకు బుధవారం వైరస్‌ సోకడంతో సీఎం నిన్నటి నుంచి ఐసోలేషన్‌లో ఉన్నారు. అనంతరం కరోనా పరీక్షలు చేయించుకోగా.. తనకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు గెహ్లోత్‌ గురువారం ట్వీట్‌ చేశారు. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపారు. అక్కడి నుంచే విధులు నిర్వహిస్తానని చెప్పారు. 

రాజస్థాన్‌లోనూ కరోనా ఉద్ధృతి విపరీతంగానే ఉంది. గత కొన్ని రోజులుగా అక్కడ రోజువారీ కేసులు 10వేలపైనే ఉంటున్నాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 16వేల కేసులు నమోదవ్వగా.. 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా కట్టడికి ప్రజలంతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లాక్‌డౌన్‌ ఉన్నట్లే వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. అంతేగాక ఏప్రిల్‌ 30 వరకు రాత్రి వేళల్లో కర్ఫ్యూ కూడా విధించింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని