₹850 చెల్లిస్తే  ₹5లక్షల ఆరోగ్య బీమా! 

తాజా వార్తలు

Published : 28/03/2021 01:35 IST

₹850 చెల్లిస్తే  ₹5లక్షల ఆరోగ్య బీమా! 

రాజస్థాన్‌లో మే 1న సార్వత్రిక ఆరోగ్య బీమా పథకం ప్రారంభం 

జైపూర్‌: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ వెల్లడించారు. ప్రతి కుటుంబానికి సార్వత్రిక ఆరోగ్య బీమా వర్తింపు పథకాన్ని మే 1న ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబం ఏడాదికి రూ.850లు చెల్లించి రూ.5లక్షల మేర బీమా కవరేజ్‌ పొందవచ్చని పేర్కొన్నారు. శనివారం వైద్య విద్యాశాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గహ్లోత్‌ మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్యరంగమే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు. అభివృద్ధి పనులు, తాగునీరు, విద్యుత్‌, విద్య, నీటిపారుదల, సాంఘిక సంక్షేమం, ఇతర రంగాలు కూడా తమ ప్రాధాన్య జాబితాలో ఉన్నాయని చెప్పారు. తాము చేపట్టిన నో మాస్క్‌ నో ఎంట్రీ విధానాన్ని యూకే కూడా అనుసరించిందని తెలిపారు.

2019 డిసెంబర్‌లో తమ ప్రభుత్వం చేపట్టిన ‘నిరోగి రాజస్థాన్‌’ క్యాంపెయిన్‌ 2020 మార్చిలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎంతో కీలకంగా మారిందన్నారు. రాష్ట్రంలో కరోనాను విజయవంతంగా నియంత్రించామని చెప్పారు. రాజస్థాన్‌లో కరోనా రికవరీ రేటు అధికంగా, మరణాల రేటు తక్కువగా ఉందని చెప్పారు. వైద్య వసతులను బలోపేతం చేశామని..  ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ టెస్ట్‌ల సామర్థ్యం 70వేలుగా ఉందని చెప్పారు. 

లాక్‌డౌన్‌ పరిష్కారం కాదు
కరోనా సెకెండ్‌ వేవ్‌పై ఆందోళన వ్యక్తంచేసిన గహ్లోత్‌.. రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఆంక్షలు విధించిందన్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. లాక్‌డౌన్‌ నష్టాలకు కారణమవుతుందని.. వైరస్‌ కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని