లోక్‌సభ సమావేశాల వేళల్లో మార్పు
close

తాజా వార్తలు

Updated : 08/03/2021 15:08 IST

లోక్‌సభ సమావేశాల వేళల్లో మార్పు

దిల్లీ: లోక్‌సభ సమావేశాల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రేపట్నుంచి (మంగళవారం) ఉదయం 11గంటలకే సభ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారికి ముందు జరిగినట్టుగానే పార్లమెంట్‌ ఉభయ సభల సమావేశాలూ ఏకకాలంలో ప్రారంభం కానున్నాయి. సమావేశాల వేళల్లో మార్పులు చేయాలని పలు పార్టీలకు చెందిన ఎంపీలు కోరడంతో రాజ్యసభ ఛైర్మన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎంపీ వందనా చవాన్‌ తెలిపారు. దీంతో రాజ్యసభ ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. రాజ్యసభ సభ్యులు ఇకపై రాజ్యసభ, గ్యాలరీలలోనే కూర్చోనున్నారు. మరోవైపు, పార్లమెట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలను కుదించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.  హోలీకి ముందే ఈ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. 

ధరల పెరుగుదలపై రాజ్యసభలో వాయిదాల పర్వం

మరోవైపు, ఈ రోజు నుంచి ప్రారంభమైన పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది. చమురు, వంటగ్యాస్ ధరల పెంపుపై రాజ్యసభలో విపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ఉదయం నుంచి మూడు సార్లు వాయిదా పడింది. సభలో సభ్యుల ఆందోళన కొనసాగడంతో సభను రేపటికి వాయిదా వేశారు. మరోవైపు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేయాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాశారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని