Parliament: అదే రగడ.. కొనసాగుతున్న వాయిదాలు..!

తాజా వార్తలు

Updated : 03/08/2021 13:51 IST

Parliament: అదే రగడ.. కొనసాగుతున్న వాయిదాలు..!

దిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ సహా పలు అంశాలపై పార్లమెంట్‌లో విపక్ష పార్టీలు తమ నిరసనల్ని కొనసాగిస్తున్నాయి. దాంతో ఉభయసభలు ఉదయం నుంచి పలుమార్లు వాయిదా పడ్డాయి.

రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే సభ్యులు వెల్ వద్దకు దూసుకురాడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఎగువ సభను మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు.. ఆ తర్వాత రెండు గంటలకు వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్‌సభలోనూ ఇదే వైఖరి కనిపించింది. పలు అంశాలపై చర్చజరపాలని విపక్షాలు పట్టుబట్టడంతో.. స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైనప్పటికీ..అదే రగడ కొనసాగడంతో రెండోసారి రెండు గంటల వరకు వాయిదాపడింది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన దగ్గరి నుంచి ఈ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో విపక్ష సభ్యుల తీరుపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ పవిత్రతను అవమానిస్తున్నారంటూ విమర్శించారు. అలాగే ప్రజాధనం వృథా అవుతోందని కేంద్రం ఆరోపిస్తోంది. ఇప్పటికే రూ.130 కోట్లకు పైగా వృథా అయినట్లు ప్రకటించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని