కేంద్ర మంత్రికి అస్వస్థత.. ఎయిమ్స్‌కి తరలింపు

తాజా వార్తలు

Published : 01/06/2021 23:00 IST

కేంద్ర మంత్రికి అస్వస్థత.. ఎయిమ్స్‌కి తరలింపు

దిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌(61) అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ప్రస్తుతం ఆయనను దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. కొవిడ్‌ తదనంతరం తలెత్తిన అనారోగ్య సమస్యలతోనే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. డాక్టర్‌ నీరజ్‌ నిశ్చల్‌ నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు ప్రస్తుతం చికిత్స అందజేస్తోంది. 

గత నెల 21న పోఖ్రియాల్‌ కరోనా బారినపడ్డారు. కొద్దిరోజుల్లోనే కోలుకున్న ఆయన ఇంటి నుంచే వర్చువల్‌గా అనేక కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై వివిధ వర్గాలతో ఆయన గత కొన్ని రోజులుగా విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని