అలా చేయనందుకు చింతిస్తున్నా: రతన్‌ టాటా

తాజా వార్తలు

Published : 11/07/2021 18:45 IST

అలా చేయనందుకు చింతిస్తున్నా: రతన్‌ టాటా

ముంబయి: రతన్‌ టాటా.. దేశంలోని గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరు. టాటా సన్స్‌ సంస్థకు అధినేత. వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని మరింత ఉన్నతస్థాయిలకు తీసుకెళ్లిన ఘనుడు. తన జీవితంలో ఎన్నో విజయాలను అందుకున్న రతన్‌టాటా ఒక విషయంలో మాత్రం ఇప్పటికీ చింతిస్తున్నారట. తనకెంతో ఇష్టమైన ఆర్కిటెక్చర్‌ వృత్తిని వదిలేసి వ్యాపారం రంగంలో అడుగుపెట్టాల్సి వచ్చిందని, ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పొందినా.. ఆ వృత్తిలో కొనసాగపోవడం తనను బాధిస్తుంటుందని రతన్‌ టాటా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

రతన్‌ టాటాకు ఆర్కిటెక్ట్‌ అవ్వాలని కోరిక ఉండేదట. కానీ, ఆయన తండ్రి రతన్‌ను ఇంజినీర్‌ను చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్‌ కాలేజీలో కూడా చేర్పించారు. కానీ, రతన్‌ ఆర్కిటెక్చర్‌పై ఆసక్తితో ఇంజినీరింగ్‌ కోర్సును వదిలేసి 1959లో న్యూయార్క్‌లోని కొర్నెల్‌ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ డిగ్రీలో చేరారు. కోర్సు పూర్తి చేసుకొని పట్టా పొందిన ఆయన.. లాస్‌ ఎంజిలెస్‌లోని ఓ ఆర్కిటెక్ట్‌ కంపెనీలో కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశారు. కానీ, విధి ఆయన్ను వ్యాపార రంగంలోకి నెట్టింది. తండ్రి నుంచి టాటా సంస్థ బాధ్యతలు తీసుసుకోవాల్సి రావడంతో తనకిష్టమైన ఆర్కిటెక్ట్‌ వృత్తిని వదిలేశారు. అందుకే, తాను ఒక ఆర్కిటెక్ట్‌ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడను కానీ.. ఆర్కిటెక్ట్‌గా కొనసాగపోవడం పట్ల చింతిస్తుంటానని రతన్‌ టాటా తెలిపారు. 

ఆర్కిటెక్చర్‌ వృత్తికి దూరంగా ఉన్నా.. ఆ కోర్సులో నేర్పించిన పాఠాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని రతన్‌ టాటా తెలిపారు. ‘‘అన్నింటిని ఒక్క చోటకు చేర్చే, ఇచ్చిన బడ్జెట్‌లో ప్రాజెక్టు పూర్తి చేయగలిగే సామర్థ్యం, వివిధ రూపాల్లో వచ్చే చిక్కులను ఎదుర్కొనే సామర్థ్యం వంటి అంశాలను ఆర్కిటెక్చర్‌ కోర్సులో బాగా బోధించారు’’అని చెప్పారు. ఎవరైనా ఒక ఆర్కిటెక్ట్‌ వ్యాపారవేత్త కాలేరు అని అంటే ఆ వ్యాఖ్య సరైంది కాదంటూ ఖండిస్తాననని రతన్‌ టాటా చెప్పుకొచ్చారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని